ఒక బొట్టు,
ఎండుతున్న గొంతుకల దాహార్తి తీరుస్తానంటూ…
కలచివేస్తున్న గుండె భారాన్ని తాను మోస్తానంటూ…
రగులుతున్న భూమి తల్లి ఒడిని చల్లారుస్తానంటూ…
వెలవెలబోతున్న కృష్ణమ్మని ఓదారుస్తానంటూ…
కలత చెందిన పిరికి మనసులను చైతన్య పరుస్తానంటూ…
కాలచక్రమున చిక్కిన చెరల నుండి విడిపిస్తానంటూ…
ఆదమరచి కులుకుతున్న అలసత్వాన్ని ఆరువులు చాటుతానని…
భానుడి భగభగలు సైతం లెక్కచేయక పోరాడతానంటూ…
వేసవి నాట వసంత పరిమళాలు పలకగా,
తరువు తనువు తాకగా, దివి నుంచి దిగి వచ్చె ఒక బొట్టు.