ఈ జీవితం ఎంతో చిత్రమైనది. మధుర క్షణాలు కలియాడు వేళ కాల సర్పమై మనసును ఛిద్రం చేస్తుంది. ఊగిసలాట తట్టుకుని కుదుట పడే లోపే కాలి కింద ఇసుక లాగా జార వేస్తుంది. ఉదయించే సూర్యుడు లా వెలుగు ని విస్తరింప చేసి, ఏదీ శాశ్వతం కాదు అని సూర్యాస్తమయం గుర్తు చేస్తుంది. కంటికి కనిపించే ఈ ప్రపంచం నిజం అనుకోవడం మూర్ఖత్వం. మనిషి విచక్షణకు అందని పరిమాణాలు ఎన్నో. ఎన్నడూ ఎరుగని ఈ రంగుల ప్రపంచం లో ఏమీ తోచక మౌనమే భాషగా, నిస్సహాయత భావమై నిలుస్తుంది. నీవు ఒంటరి అని పరుమార్లు ప్రతిధ్వనిస్తుంది. అనివార్యం అయిన ఈ ఎడారి ప్రయాణం గొంతు ఎండినా అడుగు వెనక వెయ్యక ముందుకు సాగాలి. వేసే ప్రతి అడుగు ఆచీతూచి వెయ్యాలి. ఎంతటి కాఠిన్యం అయినా దిగమింగాలి. క్షణికం అయిన సంతోషాలు, తాత్కాలిక సంబంధాలకై ప్రాకులాడితే మొదటికే మోసం. ప్రతి క్షణం పడిలేచే కెరటమై పోరాడాలి. ఆకాశమే హద్దుగా, ఎదిగిన నేల మరువక సాగాలి నీ పయనం. నీ గమ్యం మరువక బాట వదలక కదలాడిన నాడు ఎన్ని ఒడిదుడుకులు అయినా, ఆటు పోట్లయినా గుండె నిబ్బరంగా ఉంటుంది.