
తన పయనమే,తన గమనమే,తన చలనమే భయపెట్టగా
నా రాతయే,తన చేతయే,తన కూతయే వణికించగా
తన రూపమే,నా తాపమై,తన కోపమే నా శాపమై
తన చూపులే చలించగా,తన పలుకులే పులకించగా
తన స్పర్శయే పరవశించగా ,తన మోమే మురిపించగా
తన కురులే చంపకములను తాకుతూ జాలువారగా
తన కౌగిలిలో బంధీగా,తన ఒడినే ఓడలా అనంతసాగరంలో పయనించగా
తన ప్రేమే బలహీనతగా,తన నమ్మకమే రక్షగా
తన పరిచయమే మధురంగా,తన వీడ్కోలే కష్టంగా
తన జ్ఞాపకమే అనుభూతిగా ,నా భాద్యత తట్టిలేపగా
తన పునరాగమనం వద్ధనగా,నా హృదయం బరువెక్కగా
తన నిష్క్రమణతో ఒక హృదయపు సామ్రాజ్యం పతనమవ్వగా,నవ శకం మొదలవ్వగా
జాలువారె కవిత నా మది నుండి మధురంగా!!!