
దిగులు పడకు కలత చెందకు మిత్రమా!!
ఓటమి నేర్పింది నీకు గెలుపు పాఠం
వెక్కిరింత అయ్యింది నీకు ఊపిరి
చేతగానితనం అయ్యింది నీ గమ్యానికి చేదోడు
నైరాశ్యం నింపింది నీలో ఆత్మవిశ్వాసం
అతివిశ్వాసం కానుంది నీకు ఆత్మవిశ్వాసం
దిగులు పడకు కలత చెందకు మిత్రమా!!
నమ్మకం నిలబెట్టింది నిన్ను గెలుపు గమ్యంలో
మమకారం మిగిలింది నీ బాటలో బాటసారిగా
కలత చెందక కసితో కాలుదువ్వు కాలంతో
తిరిగిరాయి నీ రాతని నీ చేతలతో
సాటిలేరు నీకెవ్వరు నీకు నువ్వే పోటీ
భుజం తట్టి లేపు నీలోని నిన్ను
నీ పతనమే నీ పరుగు పయనానికి ప్రారంభం
దిగులు పడకు కలత చెందకు మిత్రమా!!
వాడెవ్వడు వీడెవ్వడు నీకు సాటి లేడెవ్వడు
మోగాలి నీ గుండెల్లో రణభేరీ
కదలాలి నీ బాహువులు జగన్నాధ రధచక్రాలలా
ఎక్కుపెట్టు నీ మదిని మదపటేనుగులా
పంచభూతాలు ఉంటాయి నీ ప్రాణానికి ప్రాణంగా
వజ్రాయుధం సైతం వణుకు నీ వీరత్వానికి
దిగులు పడకు కలత చెందకు మిత్రమా!!!
–ఓడిపోయి దిగులు పడుతున్న వారికి ఆంకితం