
దివికెగిసిన ధ్రువతార! దరి చేరు మార్గమేమి?
గగనం లో గాలిపటమా! గమనానికి చేరువెపుడు?
నయాగార జలపాతమా! నలు దిక్కులలో నాది ఏది?
భగీరథ ప్రయత్నమా! బ్రతికి బట్ట కట్టేనా?
పలుకుబడే చెల్లునా?పావులన్ని కదుపునా?
కృషి తోనే దొరుకునా?కోరి వచ్చి చేరునా?
మాట మహిమ పండునా?మలుపులెన్నో తిప్పునా?
నైపుణ్యం నేర్పునా?నా కల నెరవేరునా?
కుబేర ఐశ్వర్యమా!కొండలపై కోటలు పడునా?
కుంభస్థలం పగులునా? కొసమెరుపు మిగులునా?
నైలూనదిని అడిగేనా? నోటికొక ఓటు తెచ్చునా?
బంగాళఖతమా! బ్రతుకుతెరువు కష్టమా?
హిమాలయపు సొగసులా! హోళీ సంబరం వచ్చునా?
బ్రతుకు బ్రతకడం నేర్చునా? భారమయ్యి పోవునా?
అష్టదిగ్గజ కవులారా! ఆరు నూరు అయ్యేనా?