కాలం నాకు ఇచ్చిన వాటిలో స్నేహం ఒక గొప్ప అనుభూతి
నేస్తమా!
ఓనమాలు నేర్చాము మనమిద్దరం జంటగా,
కలిసి చేసిన అల్లరి,మరపురాని జ్ఞాపకాలు
కపటమెరుగని చిన్ని హృదయాలు,అడ్డురాని చిన్న తగువులు
కలిసిపోయే ప్రయాణాలు,పంచుకున్న చిలిపి రహస్యాలు
పిలుచుకున్న పేర్లు ఎన్నో, పుకార్లు కాస్తా మరెన్నో
స్వార్ధం లేని పసితనం, అహం ఎరుగం ఎన్నడూ
పంచుకున్న చిరునవ్వులు, కలిసి మోసిన భారాలు , కదిలిపోయిన క్షణాలు
తిరిగిరాని బాల్యం,మరువలేని అనుభవాలు,లోటు నింపిన కొత్త చిగురులు
పరిచయాల ప్రవాహం, కొత్త పుంతలు తొక్కిన పాదాలు
ఏది నిజమో,ఏది కాదో తెలుసుకోలేని అంధకారం
ఉరకలేసే మది అదుపు తప్పిన ఆలోచనలు, కానరాని లోపాలు
తడబడిన అడుగులు,గుండె నిండుగ అభిమానం
పట్టరాని సంతోషం,పంచుకోలేని బాధ, తిరిగిరావా నేస్తమా…..!!!!!!
కలల తోటి కాలయాపన , కొత్త బంగారు లోకం, కోరి మరీ పిలుస్తుంది
చల్లారని సంకల్పం, మరుగుతున్న రక్తం , ఏ దరికి చేర్చునో?
తోడు నీవై ఉండగా, కాన రాదు కష్టం, ఏ గూటికి చేరావు నేస్తమా?
నీవు లేని నా ప్రయాణం, నడక రాణి పసితనం , జతగా కలియ పోదామా నేస్తమా?
కాలమెంత కఠినమో, అయిన ఆగదీ నిరీక్షణ , చెంత చేరవా నేస్తమా!!!!!