
పగిలెనంట బాధతో, పేదవాని కడుపు
ధరించెనట వాడు దారిద్ర్యపు రూపు
ఎచట చుసిన నిరాశపు నిట్టూర్పు
లేదట అవకాశం, ఎంత కాలమీ ఓర్పు
చేదట జీవితం, అదృష్టం లేక ఏడ్పు
ప్రాకులాట ఇది, పైసల కోసం అప్పు
తడబాటుతో నడక, ఏది కోరినా తప్పు
అందుబాటులో కొంత, మరింతకీ చేజాపు
అటూ,ఇటూ చూడు, ఏనాడు రానుందో మార్పు
ఎడబాటు నువ్వంటే, దక్కేనా నీకు రేపు
చేటు కాదా ఇది,ఏమవునో నీ భవితకు చేర్పు
ఓటు కావాలి నీది, చిందాలి నీ రక్తపు ఎరుపు
పోటు మీద పోటు, భరించడం నేర్పు
మాట ఉంది నీకు తుడిచెయ్ నీ నలుపు
పాట పాడి చూడు,మనసు విప్పి తెలుపు
బాట మార్చి చూడు, చిక్కుతుంది మలుపు