యాత్ర!
ఇది వలస కార్మికుల బ్రతుకు తెరువు యాత్ర
కడుపు కోతతో పొట్టబట్టి మొదలిడిన యాత్ర
సొంత దేశాన పరాయి బ్రతుకుల జీవన పోరాట యాత్ర
మండుటెండల వేల మైళ్ల సిసలైన పాదయాత్ర
దాహార్తితో ఎండిన గొంతుక ఎడారి యాత్ర
మోపెడంత ఉండగా తలపై బ్రతుకు బరువు యాత్ర
నిండు బాలింత అరణ్య రోదనతో ఆసుపత్రి యాత్ర
చంకన పసికందు ఆకలి కేకల యాత్ర
ఆశగా ఇంటి బాట పట్టిన భుమిపుత్రుల యాత్ర
కంటి కెరుగని మహమ్మారితో కకా వికళమైన జీవుల యాత్ర
ప్రకృతి కోపానికి పేదవాని బలిదానం ఈ యాత్ర
మానవత్వం మరచిన జనాలకి దూరంగా అమ్మ ఒడికి చేరు యాత్ర
కడ దాకా ఆగనంటుంది ఈ చిధ్రమైన యాత్ర!!!