ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం నీ సృష్టి
గర్భ నరకములో కాలాన్ని సైతం పోరాడింది నీ సంకల్పం
ఎంతటి కలవరమైనా చెంతకు రానీదు నీ ఆత్మ స్థైర్యం
కష్టం వచ్చినా నష్టం వచ్చినా తరగని నీ తెగుంపే మా ఊపిరి
ఎదురొచ్చిన ఎగుడు దిగుడులు ఏమైనా జయించాం ఎన్నైనా దాటేసాం
కోమలమైన నీ స్పర్శ, తన్మయంలో మా హృదయాలు
నీ చిరునవ్వులు మా ఇంట సిరుల పరవళ్ళు
నీ కేరింతలు, బుడి బుడి నడకలు ఆ వెన్నెల సైతం అసూయ పడాలి
ఈ భువిపై సాగాలి నీ అన్వేషణ, రెక్కలు విప్పి అందుకో ఆకాశం
ఎంత దూరమైనా తోడుంటాం, ఎన్ని యుద్ధాలైన పోరాడదాం
ఎండిన గొంతుకి, అలసిన గుండెకి ఊపిరి నీవే
కొత్త ఏడాదికి పూసిన పూత ఈ కలం…నీకు అంకితం అరుదైన స్వాతి ముత్యమా…