My first steps into college with mind full of pride and confidence, heartful of hopes,eyes full of excitement and anxiety,still with a confused soul.Everything seemed to be exciting.New place,new friends,new thoughts…….everything made my eyes open and wonder. Magical thing about these is it didn’t take much time for these to take control of my mind…
Month: February 2026
ఎగిరే పావురమా
ఎగిరే పావురమా!!!!ఎవరికి అందని ఎత్తులు చేరావు, రెక్కలు విప్పి చుక్కలు తాకావుచెదరని చురుకుతనం, ఉరకలేసే ఉత్సాహం సొంతము కాగా,పైరు గాలి పరవశించగా , పగటి వెలుతురు ప్రకాశించగానింగి నిండుగా అద్భుతం , భానుకిరణుడికి వందనంచీకటి చెరలు చీల్చగా , కాంతి ప్రకాశపు పరిమళాలుసంద్రపు అలలు సందడి చేయగా , గగనతలంలో స్వైరవిహారంనేలను తాకే నీటిబొట్టు , దేహము అడ్డుగా రాలెనుఉప్పొంగే సెలయేరు, ఉర్రూతలూగించె పచ్చదనంకుండ నిండుగా ఈత కల్లు, గుండె నిండుగా ఆత్మ విశ్వాసంఒంటరి కాదు నీ…
నేస్తమా!
కాలం నాకు ఇచ్చిన వాటిలో స్నేహం ఒక గొప్ప అనుభూతి నేస్తమా!ఓనమాలు నేర్చాము మనమిద్దరం జంటగా,కలిసి చేసిన అల్లరి,మరపురాని జ్ఞాపకాలుకపటమెరుగని చిన్ని హృదయాలు,అడ్డురాని చిన్న తగువులుకలిసిపోయే ప్రయాణాలు,పంచుకున్న చిలిపి రహస్యాలుపిలుచుకున్న పేర్లు ఎన్నో, పుకార్లు కాస్తా మరెన్నోస్వార్ధం లేని పసితనం, అహం ఎరుగం ఎన్నడూపంచుకున్న చిరునవ్వులు, కలిసి మోసిన భారాలు , కదిలిపోయిన క్షణాలుతిరిగిరాని బాల్యం,మరువలేని అనుభవాలు,లోటు నింపిన కొత్త చిగురులుపరిచయాల ప్రవాహం, కొత్త పుంతలు తొక్కిన పాదాలుఏది నిజమో,ఏది కాదో తెలుసుకోలేని అంధకారంఉరకలేసే మది అదుపు…
అసమర్ధుని జీవితయాత్ర
యాత్ర ఇది, అసమర్ధుని జీవితయాత్రఆశ అనే శ్వాసతో బతికే దీనుడి యాత్ర ఇది. గతమెంతో వైభవం నాడు, గతిలేక చితికెను నేడుకానరాని రేపు,మోయలేని భారం, భవిత పయనమేదారి ? దిశలు మార్చు కూడలి,దరికి చేరి పలకరించెవిలువలున్న దారి మనసు మెచ్చిన దారి,ఒంటరిగా నిలిచెకానరాని బాట,గమ్యమెరుగని బాట,ఎండమావిని తలపించేనలుగురున్న బాట, మనసు మెచ్చని బాట,అణిగి మణిగి పయనించెమోహపు జల్లులు కురిసే దారి,నడకరాక తడబడిన దారి ,కడుపు నింపి ముందుకు నడిపించేమనసు కోరిన సంతృప్తి,ఆకలి తీరిన కడుపు, ఏది నిన్ను…
నలు దిశలూ
నలు దిశలూ నలుపాయే, పలు మూలలు పతనమాయేకానరాని వాడినాయే , కడలి కడుపున కఠినమాయేఆశ కూడా పాశమాయె, శ్వాస ఆగు వేళాయేగతమంతా మతిన మెదిలే, గతి తలచి తనువు చలించెభవిత చాలా భారమాయె, బదులు చెప్పక చితికిపోయేఇష్టమన్నది కష్టమాయే, ముష్టిఘాతకముకు నష్టపోయేపరువు పోరులో బక్కనాయే, పగటి కలలతో మురిసిపోయేచేతగాని వాడినాయే, చెదిరిపోని చెదల చెంతపడీ ఉండిపోయేఅటవిలోన మొక్కనాయే, వటవృక్షపు ధాటికి విగతజీవిగా మారిపోయేమతికి వ్యధ తోడుగాయే, తనువు తనని కాదని వదిలిపోయేఎదను దాచిన నవ్వునై, కడలి గర్బమున…
ఆ క్షణాలు…………..
ఆ క్షణాలు,విజయోత్సాహంలో ఒక ఉప్పెనలా వెల్లువెత్తిన అపురూప క్షణాలుఆ క్షణాలు,నిరాశతో నడిచే చోట,విజయగర్వంతో పరిగెడిన క్షణాలుఆ క్షణాలు,మాటలు రాని మౌనం,జూలు విదిల్చి సింహంలా ఘర్జించిన క్షణాలుఆ క్షణాలు,హృదయపు లోతున భావాలు,సంద్రపు అలలవలే ఉప్పొంగిన క్షణాలుఆ క్షణాలు,అలుపెరుగని నిరీక్షణ,ఒక చిచ్చుకి మసిగా మారినా క్షణాలుఆ క్షణాలు,స్వార్ధం లేని విశ్వాసం,సప్తవర్ణాలుగా నింగిన అవతరించిన క్షణాలుఆ క్షణాలు,వంచనతో నీరసించిన కనులు,వేయి దివ్వెల ప్రకాశంతో ప్రజ్వలించిన క్షణాలుఆ క్షణాలు,చులకనైన చేతలకు,చెదలు పట్టిన చెరలకు చరమగీతం పాడిన క్షణాలుఆ క్షణాలు,చరిత కాదని నలువైపులూ హడలేలా…
స్వార్ధం
స్వార్ధం మనిషి అసలు రూపం.అవసరం కోసం మనిషి ఎన్ని పుంతలైనా తొక్కుతాడు.ఏది తప్పు,ఏది ఒప్పు అనేది కేవలం మనిషి అవసరం,స్వార్ధం,సుఖం,విచక్షణ పైనే ఆధారపడి ఉంటది.నమ్మకం అనేది ఎప్పటికైనా అశాస్వతం.కామ,క్రోధ,మధమాశ్చర్యాలు మనిషిని మనిషి కాకుండా చేస్తున్నాయ్. ఆశతో కూడిన ఆవేశం మనిషిని మరో మజిలీకి చేరుస్తుంది. సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. న్యాయాలు,ధర్మాలు అపహాస్యం అవుతాయి.మంచి చెడులనేవి వాటి మంచితనంకంటే దాని వెనకున్న గొంతులు,ఆర్భాటాలు,చాకచక్యం, భుజబలం మీదే ఆధారపడి ఉంటాయి .ఈ ప్రపంచం లో ఏదైనా సాపేక్షత పైనే ఆధారపడి ఉంటది. అలాగే…
తన కోసం……
తన పయనమే,తన గమనమే,తన చలనమే భయపెట్టగానా రాతయే,తన చేతయే,తన కూతయే వణికించగాతన రూపమే,నా తాపమై,తన కోపమే నా శాపమైతన చూపులే చలించగా,తన పలుకులే పులకించగాతన స్పర్శయే పరవశించగా ,తన మోమే మురిపించగాతన కురులే చంపకములను తాకుతూ జాలువారగాతన కౌగిలిలో బంధీగా,తన ఒడినే ఓడలా అనంతసాగరంలో పయనించగాతన ప్రేమే బలహీనతగా,తన నమ్మకమే రక్షగాతన పరిచయమే మధురంగా,తన వీడ్కోలే కష్టంగాతన జ్ఞాపకమే అనుభూతిగా ,నా భాద్యత తట్టిలేపగాతన పునరాగమనం వద్ధనగా,నా హృదయం బరువెక్కగాతన నిష్క్రమణతో ఒక హృదయపు సామ్రాజ్యం పతనమవ్వగా,నవ…
పగిలెనంట బాధతో…
పగిలెనంట బాధతో, పేదవాని కడుపుధరించెనట వాడు దారిద్ర్యపు రూపుఎచట చుసిన నిరాశపు నిట్టూర్పులేదట అవకాశం, ఎంత కాలమీ ఓర్పుచేదట జీవితం, అదృష్టం లేక ఏడ్పుప్రాకులాట ఇది, పైసల కోసం అప్పుతడబాటుతో నడక, ఏది కోరినా తప్పుఅందుబాటులో కొంత, మరింతకీ చేజాపుఅటూ,ఇటూ చూడు, ఏనాడు రానుందో మార్పుఎడబాటు నువ్వంటే, దక్కేనా నీకు రేపుచేటు కాదా ఇది,ఏమవునో నీ భవితకు చేర్పుఓటు కావాలి నీది, చిందాలి నీ రక్తపు ఎరుపుపోటు మీద పోటు, భరించడం నేర్పుమాట ఉంది నీకు తుడిచెయ్…
దివికెగిసిన ధ్రువతార!
దివికెగిసిన ధ్రువతార! దరి చేరు మార్గమేమి?గగనం లో గాలిపటమా! గమనానికి చేరువెపుడు?నయాగార జలపాతమా! నలు దిక్కులలో నాది ఏది?భగీరథ ప్రయత్నమా! బ్రతికి బట్ట కట్టేనా?పలుకుబడే చెల్లునా?పావులన్ని కదుపునా?కృషి తోనే దొరుకునా?కోరి వచ్చి చేరునా?మాట మహిమ పండునా?మలుపులెన్నో తిప్పునా?నైపుణ్యం నేర్పునా?నా కల నెరవేరునా?కుబేర ఐశ్వర్యమా!కొండలపై కోటలు పడునా?కుంభస్థలం పగులునా? కొసమెరుపు మిగులునా?నైలూనదిని అడిగేనా? నోటికొక ఓటు తెచ్చునా?బంగాళఖతమా! బ్రతుకుతెరువు కష్టమా?హిమాలయపు సొగసులా! హోళీ సంబరం వచ్చునా?బ్రతుకు బ్రతకడం నేర్చునా? భారమయ్యి పోవునా?అష్టదిగ్గజ కవులారా! ఆరు నూరు అయ్యేనా?