
నీ గమ్యం ఇదేనా?నీ అడుగులు సరియేనా??
నీ తడబడిన అడుగులలో మసకబారిన గమ్యమిదేనా??
నలుగురితో నడక నీ గురికి చీలిక!
కాసుల కోసం పరుగు ఇదేనా తిరకాసు?
పగటి కలగా మిగిలే పనిలో సంతృప్తి పోయే!!
అలసత్వం,చేతగానితనం ఇదేనా నీ సంకల్పం??
నీ కోరికకు సర్దుబాటు ఎన్నటికి కాబోదు దిద్దుబాటు!!!
ప్రగల్భాలు పలికిన మదికి ఆత్మవంచన సరియేనా???
చాపకింద నీరు గాలి కోరి ఆవిరాయే !!!!
గుండెకోత,మనోవేదన ఇదేనా కారణజన్మం????
నీలకంటుడివి కావు సకలకళావల్లభుడసలే కావు!!!!!
-ఆసక్తి లేని పని చేస్తున్న వారికి అంకితం