
చెదిరిన కలయే చెదగా మిగిలినా,
నడవని కథయే నొప్పితో పగిలినా,
వదిలిన దారియే వెదుకుతు తిరిగినా,
కలిగిన బాధయే కారణం కోరినా ,
తలచిన కార్యమే తరలి పోయినా,
నలిగిన మదియే నరకం చూసినా,
తడిసిన మనసే తపనతో కదిలినా,
ఒరిగిన ధైర్యమే ఒడిసి పట్టినా,
కరిగిన పదమే కాలం రచించినా,
ఎరుగని ఫలితమే ఎదనే కోసినా,
కదలని వైనమే కోరలు చాపినా,
మరచిన బాధయే మరలా మెదలినా,
కోరికని వదలక కసితో కదిలినా,
మౌనం మిగిలెను మాటల బదులున,
వ్యధతో నడిచెను,కడలి అంచున
తనువే మిగిలెను,సాగర నడుమున
మనసే కలిసెను ,గగనపు అంచున