స్వార్ధం మనిషి అసలు రూపం.అవసరం కోసం మనిషి ఎన్ని పుంతలైనా తొక్కుతాడు.ఏది తప్పు,ఏది ఒప్పు అనేది కేవలం మనిషి అవసరం,స్వార్ధం,సుఖం,విచక్షణ పైనే ఆధారపడి ఉంటది.నమ్మకం అనేది ఎప్పటికైనా అశాస్వతం.కామ,క్రోధ,మధమాశ్చర్యాలు మనిషిని మనిషి కాకుండా చేస్తున్నాయ్. ఆశతో కూడిన ఆవేశం మనిషిని మరో మజిలీకి చేరుస్తుంది. సంబంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. న్యాయాలు,ధర్మాలు అపహాస్యం అవుతాయి.మంచి చెడులనేవి వాటి మంచితనంకంటే దాని వెనకున్న గొంతులు,ఆర్భాటాలు,చాకచక్యం, భుజబలం మీదే ఆధారపడి ఉంటాయి .ఈ ప్రపంచం లో ఏదైనా సాపేక్షత పైనే ఆధారపడి ఉంటది. అలాగే గెలుపోటములు,తప్పువొప్పులు
అనేవి పోలిక లేకుండా మనుగడ సాగించడం కష్టం. అలా గెలిచిన గెలుపు మేలు చేస్తుందని చెప్పలేం. మనిషి జీవితంలో అడుగడుగునా ప్రలోభాలకి గురవుతాడు. కొన్ని అంతర్ ప్రలోభాలు ఐతే మరికొన్ని బహ్యమైనవి. మన మది నిరంతరం ఈ రెండిటి ప్రభావంలో నిజాన్ని విస్మరిస్తుంది. స్వార్ధం అనే నిప్పుకి అహం అనే ఆజ్యం పోస్తే అది ప్రలోభాలకు లోనై తన ఆశని నిలబెట్టుకోవాలని ఆవేశం అనే ముసుగులో ఉగ్రరూపం దాల్చి మాహాజ్వాలాగ్నిలా మారి తన చుట్టూ ఉన్న తన మంచిని చేధిస్తుంది. మనిషి క్షణికమైన
ఆలోచనతో,క్షణికమైన సుఖాల కోసం శాస్వతమైన వాటికి దూరం అవుతున్నాడు.అవసరాల కోసం జాతిని చీలుస్తున్నాడు.పోటితత్వాన్ని అలవాటు చేసాడు.ఒకరిపై ఒకరు ఎత్తిపొడుచుకునేలా చేసాడు .పోటీ,గెలుపు,ఆధిపత్యం ఆకలిదప్పులకంటే అవసరాలులాగా మారాయి.ప్రాణ మిత్రులను సైతం బద్ధ శత్రువులుగా మార్చగల శక్తి ఉంది దీనికి.మనిషిని మనిషి అర్ధం చేసుకునే స్థితిని పక్కన పెడితే తనని తానే అర్ధం చేస్కోలేని దీన స్థితికి చేరుకున్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది.