నలు దిశలూ నలుపాయే, పలు మూలలు పతనమాయే
కానరాని వాడినాయే , కడలి కడుపున కఠినమాయే
ఆశ కూడా పాశమాయె, శ్వాస ఆగు వేళాయే
గతమంతా మతిన మెదిలే, గతి తలచి తనువు చలించె
భవిత చాలా భారమాయె, బదులు చెప్పక చితికిపోయే
ఇష్టమన్నది కష్టమాయే, ముష్టిఘాతకముకు నష్టపోయే
పరువు పోరులో బక్కనాయే, పగటి కలలతో మురిసిపోయే
చేతగాని వాడినాయే, చెదిరిపోని చెదల చెంతపడీ ఉండిపోయే
అటవిలోన మొక్కనాయే, వటవృక్షపు ధాటికి విగతజీవిగా మారిపోయే
మతికి వ్యధ తోడుగాయే, తనువు తనని కాదని వదిలిపోయే
ఎదను దాచిన నవ్వునై, కడలి గర్బమున అనలమాయె
చలనమెరుగక చెంతచేరక, ఎడారి నడుమున బాటసారినాయే