యాత్ర ఇది, అసమర్ధుని జీవితయాత్ర
ఆశ అనే శ్వాసతో బతికే దీనుడి యాత్ర ఇది.
గతమెంతో వైభవం నాడు, గతిలేక చితికెను నేడు
కానరాని రేపు,మోయలేని భారం, భవిత పయనమేదారి ?
దిశలు మార్చు కూడలి,దరికి చేరి పలకరించె
విలువలున్న దారి మనసు మెచ్చిన దారి,ఒంటరిగా నిలిచె
కానరాని బాట,గమ్యమెరుగని బాట,ఎండమావిని తలపించే
నలుగురున్న బాట, మనసు మెచ్చని బాట,అణిగి మణిగి పయనించె
మోహపు జల్లులు కురిసే దారి,నడకరాక తడబడిన దారి ,కడుపు నింపి ముందుకు నడిపించే
మనసు కోరిన సంతృప్తి,ఆకలి తీరిన కడుపు, ఏది నిన్ను నిలుపునో ?
మెచ్చిన దారి మల్లినా,ఒంటరి ప్రయాణం చేసినా,తదుపరి ప్రశ్నకు మనసు క్షోభించే
నాలుగు గొంతుకుల మాటలు,మనసును చోచ్చుకునే తూటాలు ,మిగిలేనా ఆశలు గమ్యమంచువరకు ?
పట్టువదలని ప్రయాణం,బక్కపలచని విశ్వాసం,మిగలక ఉండదు చరితకొక మైలురాయి
కీర్తి కోసం ప్రాకులాట, అవసరాల భాద్యత,సర్దుబాటు కానిదే అడుగు కదలని దౌర్భాగ్యం
మోయాల్సిన భారం,స్వార్ధంలేని చూపులు,కదలగలవా వీటి తోడుగా ?
అసమర్దుడ్ని కాదనుచూ,సంకల్పమే బలంగా ,పోగలవా పగటికలలు గెలవగ పోరులో ?
చేతగానివాడివా ? నిర్లక్షపు ధొరనా ? మూతపడునా ఈ వెటకారపు విసుర్లు ?
దురదృష్టం దరిన ఉండె, పట్టినదల్ల బూడిదాయే,తిరిగిరా గోడకు కొట్టిన బంతి వలే
ఒదిగి ఒదిగి ఉండవలె, అవకాశం కోసం ఎదురు చూసే ,ఎదిగి ఎదిగి కుదిపేసేయ్
బిక్కు బిక్కుమని వణికిపోయే తనకు ఎదురైన అవమానపు చేతలు
యాత్ర ఇది, అసమర్ధుని జీవితయాత్ర
ఆశ అనే శ్వాసతో బతికే దీనుడి యాత్ర ఇది.