ఎగిరే పావురమా!!!!
ఎవరికి అందని ఎత్తులు చేరావు, రెక్కలు విప్పి చుక్కలు తాకావు
చెదరని చురుకుతనం, ఉరకలేసే ఉత్సాహం సొంతము కాగా,
పైరు గాలి పరవశించగా , పగటి వెలుతురు ప్రకాశించగా
నింగి నిండుగా అద్భుతం , భానుకిరణుడికి వందనం
చీకటి చెరలు చీల్చగా , కాంతి ప్రకాశపు పరిమళాలు
సంద్రపు అలలు సందడి చేయగా , గగనతలంలో స్వైరవిహారం
నేలను తాకే నీటిబొట్టు , దేహము అడ్డుగా రాలెను
ఉప్పొంగే సెలయేరు, ఉర్రూతలూగించె పచ్చదనం
కుండ నిండుగా ఈత కల్లు, గుండె నిండుగా ఆత్మ విశ్వాసం
ఒంటరి కాదు నీ ప్రయాణం, శోభతో నిండెను ఆకాశం
కొండలు,గుట్టలు దాటావు , గుడిసెలు పైన వాలావు
కోడి కూతలు కూయగా, అన్నదాత పైరు బాట పట్టగా,
స్త్రీలు కళ్ళాపి చల్లగా, రంగవల్లుల హరివిల్లు కనువిందు చేయగా
కమ్మగా పిలిచెను మాగాణి, రివ్వున ఎగిరే పావురమా!!!!!!!!!!!!