కరుగుతున్న కాలం, చెదిరిపోయిన జ్ఞాపకాలు
నిండుకున్న మనసు, గడిచిపోయిన క్షణాలు
మారుతున్న ప్రపంచం, దారి తెలియని అడుగులు
వేల స్మృతుల వీడ్కోలు, రేపటికై ఆశగా చూస్తున్న కనులు
వెంట రానున్న ఒంటరితనం, మదిలో మెదిలిన మలుపులు
చిన్నబోనున్న చిలిపితనం, ఆవిరైన మధురానుభూతులు
మురిసిన మనసు కోలాహలం, అక్కున పరుచుకున్న చల్లని రాత్రులు
నీడలా తోడున్న నేస్తం,పంచుకున్న ఎన్నో పదనిసలు
దూరమవుతున్న వర్తమానం, కడలి చెప్పిన వీడ్కోలు