ఉన్న చోట నిలువలేక గగనపు అంచులకై ఈ నిరీక్షణ
క్రొత్త దనానికై పరితపించే ఈ పసి మనసు..పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ వలె
వేల మైళ్ళ గమనాల పయనం..ఆశగా వేచి చూస్తున్న వలస పక్షి
అద్భుతమైన పర్వత శ్రేణులు,లోయలపై విహారం.. మరుచునా నల్ల రేగళ్ళను ఈ కనులు
వివిధ భాషల ఝుంఝుం నాదాలు..తేట తెనుగుకి సాటి రాగలవా
భిన్న సంస్కృతుల అనుభవాలు..కలుగునా మంగళకరమైన అనుభూతి
నూతన గమ్యాలకై అన్వేషణ..తిరిగి మూలాలకు చేరునా
పరాయి రాజ్యాన బాటసారి..స్వేచ్ఛ ఉండునా పుట్టినగడ్డ మలే
ఎన్నెన్నో వింతలు,మరెన్నో విచిత్రాలు..మరొక మయసభ కావునా
మార్పు కోసం ప్రాకులాడే మనుజుడు..మరిచేనా దూరపు కొండలు నునుపని