కడలి గర్భాన ఉసురులతో చెలగాటం
అలుపెరుగక ఎన్ని ఘడియల పోరాటం !
ఎదురుచూపులే ఆలికి, మనువాడిన పెనిమిటి కోసం
కూసింత కునుకు లేక, ఆకలి కేక కి సత్తువ లేక !
రణరంగంలో నూనుగు మీసాల వీరత్వం
తపనతో తల్లడిల్లుతున్న కన్న పేగుబంధం !
మండే ఎండకి బీటలు వారిన భూమి
తొలకరి జల్లుకై నింగిని వేడుతున్న కనులు !
గతిలేక రొక్కం కోసం చేతులు చాచిన నిస్సహాయత
మోయలేని భారం, తీర్చేయాలనే తపన, కాలంతో ప్రయాణం !
కర్కశపు సమాజం, కూడు గుడ్డ కరువైన దారిద్య్రం
ఓర్పే ఊపిరై భవిత నిట్టూర్పే ఓదార్పై ఆగనంటుంది…..ఈ నిరీక్షణ!