పున్నమి రేయిన కురిసిన ఓ చల్లని వెన్నలా
కనులు కనని అపురూపమైన అరోరా కాంతివా
పుష్కర కాలానికి పూసిన నీలకురింజి పుష్పమా
ముంగిన ముచ్చటగ నిలిసిన ముత్యమా
ఎండమావుల ఈ ఎడారి బతుకులో నీటి చలమవా
మంగళకరము నీ కదలిక.. పచ్చని పైరులా, పారే సెలయేటిలా
కూని రాగాల ఈ గొంతుకకు లయ కలిపిన సంగీతమా
కడలి గర్భాన నిక్షిప్తమైన పగడపు దిబ్బవా
నీ చిరునవ్వులే తొలకరి చినుకులా, పలుకులే పదనిసలా
నింగి నుండి నేలరాలిన అమృతమా, కరువయ్యాయే మాటలు నిన్ను వర్ణింపగ