ఎండిన గొంతుక ఆర్తి తీర్చే నీరు, ఎగిసే కెరటమై ముంచదా ఉప్పెనలా
ఊపిరి పొసే గాలి, ఊరినే మింగదా ఉవ్వెత్తున సుడిగాలిలా
సహనంతో పాపాల భారం మోసే పుడమి, ఒక్క కబళింపుకు పతనమవ్వవా పేక మేడలు
ప్రాణం పోసే సూర్యకిరణం, పరాకాష్టలో భగ్గుమని బూడిద మిగలదా
అందనంత ఎత్తున ఆకాశం, అహంకారంతో అడుగు తడపడితే అధః పాతాళం
దేనిని చూసుకుని అహంకారం, చివరికి మిగిలేది శూన్యం అనే అంధకారం
ఎవరి మీద పెత్తనం, దేనికింత దౌర్జన్యం, కాలం అనేది శాశ్వతమా
సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం మట్టి కరవలేదా, సింధూ నాగరికత శిధిలమై వల్లకాడు కాదా
నేడు అన్నది నీది కాబోలు విర్ర వీగుతున్నావు, కాలి కింది ఇసుకలా రేపు అన్నది మారదా
జగన్నాటకంలో తోలు బొమ్మలం, విధి చదరంగానా పావులం, లొంగక తప్పదు కాలానికి ఎన్నటికైనా
Great content! Keep up the good work!