ఎండిన గొంతుక ఆర్తి తీర్చే నీరు, ఎగిసే కెరటమై ముంచదా ఉప్పెనలా ఊపిరి పొసే గాలి, ఊరినే మింగదా ఉవ్వెత్తున సుడిగాలిలా సహనంతో పాపాల భారం మోసే పుడమి, ఒక్క కబళింపుకు పతనమవ్వవా పేక మేడలు ప్రాణం పోసే సూర్యకిరణం, పరాకాష్టలో భగ్గుమని బూడిద మిగలదా అందనంత ఎత్తున ఆకాశం, అహంకారంతో అడుగు తడపడితే అధః పాతాళం దేనిని చూసుకుని అహంకారం, చివరికి మిగిలేది శూన్యం అనే అంధకారం ఎవరి మీద పెత్తనం, దేనికింత దౌర్జన్యం, కాలం…
Category: Telugu Poetry
స్వాతిముత్యం
ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం నీ సృష్టి గర్భ నరకములో కాలాన్ని సైతం పోరాడింది నీ సంకల్పం ఎంతటి కలవరమైనా చెంతకు రానీదు నీ ఆత్మ స్థైర్యం కష్టం వచ్చినా నష్టం వచ్చినా తరగని నీ తెగుంపే మా ఊపిరి ఎదురొచ్చిన ఎగుడు దిగుడులు ఏమైనా జయించాం ఎన్నైనా దాటేసాం కోమలమైన నీ స్పర్శ, తన్మయంలో మా హృదయాలు నీ చిరునవ్వులు మా ఇంట సిరుల పరవళ్ళు నీ కేరింతలు, బుడి బుడి నడకలు ఆ వెన్నెల…
అమృతం కురిసిన రాత్రి
పున్నమి రేయిన కురిసిన ఓ చల్లని వెన్నలా కనులు కనని అపురూపమైన అరోరా కాంతివా పుష్కర కాలానికి పూసిన నీలకురింజి పుష్పమా ముంగిన ముచ్చటగ నిలిసిన ముత్యమా ఎండమావుల ఈ ఎడారి బతుకులో నీటి చలమవా మంగళకరము నీ కదలిక.. పచ్చని పైరులా, పారే సెలయేటిలా కూని రాగాల ఈ గొంతుకకు లయ కలిపిన సంగీతమా కడలి గర్భాన నిక్షిప్తమైన పగడపు దిబ్బవా నీ చిరునవ్వులే తొలకరి చినుకులా, పలుకులే పదనిసలా నింగి నుండి నేలరాలిన అమృతమా,…
నిరీక్షణ
కడలి గర్భాన ఉసురులతో చెలగాటం అలుపెరుగక ఎన్ని ఘడియల పోరాటం ! ఎదురుచూపులే ఆలికి, మనువాడిన పెనిమిటి కోసం కూసింత కునుకు లేక, ఆకలి కేక కి సత్తువ లేక ! రణరంగంలో నూనుగు మీసాల వీరత్వం తపనతో తల్లడిల్లుతున్న కన్న పేగుబంధం ! మండే ఎండకి బీటలు వారిన భూమి తొలకరి జల్లుకై నింగిని వేడుతున్న కనులు ! గతిలేక రొక్కం కోసం చేతులు చాచిన నిస్సహాయత మోయలేని భారం, తీర్చేయాలనే తపన, కాలంతో ప్రయాణం…
గమనం
బక్క సిక్కిన సన్నకారు రైతన్నా, ఆశపడవా తొలకరి సినుకుకై నడి సంద్రాన గంగ పుత్రులా, ఈదగలరా ఆ సినుకు ఉప్పెనకు దట్టపు చీకటిని కమ్మిన పుడమి, చీల్చడా భానుడి కిరణాలు గూడు చెదిరిన గిరిజనుడా, దోమ కాటుకు దక్కేనా నీ పానం పుత్తడి వెలుగుల పసి బిడ్డడా, తడబడినా అడుగు నిలపగలవా కూడు బాట నడిసిన బతుకు జీవుడా, చేరేవా నీ గమ్యం ఆకలి కడుపున పానాలు నిలిపే వైద్యుడా, కుదిరేనా కాసంత కునుకు పెను గాలికి…
విహారి
ఉన్న చోట నిలువలేక గగనపు అంచులకై ఈ నిరీక్షణ క్రొత్త దనానికై పరితపించే ఈ పసి మనసు..పరవళ్ళు తొక్కుతుంది కృష్ణమ్మ వలె వేల మైళ్ళ గమనాల పయనం..ఆశగా వేచి చూస్తున్న వలస పక్షి అద్భుతమైన పర్వత శ్రేణులు,లోయలపై విహారం.. మరుచునా నల్ల రేగళ్ళను ఈ కనులు వివిధ భాషల ఝుంఝుం నాదాలు..తేట తెనుగుకి సాటి రాగలవా భిన్న సంస్కృతుల అనుభవాలు..కలుగునా మంగళకరమైన అనుభూతి నూతన గమ్యాలకై అన్వేషణ..తిరిగి మూలాలకు చేరునా పరాయి రాజ్యాన బాటసారి..స్వేచ్ఛ ఉండునా పుట్టినగడ్డ…
యాత్ర
యాత్ర!ఇది వలస కార్మికుల బ్రతుకు తెరువు యాత్రకడుపు కోతతో పొట్టబట్టి మొదలిడిన యాత్రసొంత దేశాన పరాయి బ్రతుకుల జీవన పోరాట యాత్రమండుటెండల వేల మైళ్ల సిసలైన పాదయాత్రదాహార్తితో ఎండిన గొంతుక ఎడారి యాత్రమోపెడంత ఉండగా తలపై బ్రతుకు బరువు యాత్రనిండు బాలింత అరణ్య రోదనతో ఆసుపత్రి యాత్రచంకన పసికందు ఆకలి కేకల యాత్రఆశగా ఇంటి బాట పట్టిన భుమిపుత్రుల యాత్రకంటి కెరుగని మహమ్మారితో కకా వికళమైన జీవుల యాత్రప్రకృతి కోపానికి పేదవాని బలిదానం ఈ యాత్రమానవత్వం మరచిన…
ఒక బొట్టు
ఒక బొట్టు,ఎండుతున్న గొంతుకల దాహార్తి తీరుస్తానంటూ…కలచివేస్తున్న గుండె భారాన్ని తాను మోస్తానంటూ…రగులుతున్న భూమి తల్లి ఒడిని చల్లారుస్తానంటూ…వెలవెలబోతున్న కృష్ణమ్మని ఓదారుస్తానంటూ…కలత చెందిన పిరికి మనసులను చైతన్య పరుస్తానంటూ…కాలచక్రమున చిక్కిన చెరల నుండి విడిపిస్తానంటూ…ఆదమరచి కులుకుతున్న అలసత్వాన్ని ఆరువులు చాటుతానని…భానుడి భగభగలు సైతం లెక్కచేయక పోరాడతానంటూ…వేసవి నాట వసంత పరిమళాలు పలకగా,తరువు తనువు తాకగా, దివి నుంచి దిగి వచ్చె ఒక బొట్టు.
ఉగాది
తీపి అనుభూతుల తొలకరి ఈ ఉగాదిచేదు అనుభవాల జ్ఞాపకం ఈ ఉగాదివగరు ఒలికిన ఆశ్చర్యం ఈ ఉగాదికారం కూడిన క్రోధం ఈ ఉగాదిఉప్పు కలవగా వచ్చిన రుచి ఈ ఉగాదిపుల్లటి పదనిసలు పలికిన ఈ ఉగాదిషడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది.
కరుగుతున్న కాలం
కరుగుతున్న కాలం, చెదిరిపోయిన జ్ఞాపకాలునిండుకున్న మనసు, గడిచిపోయిన క్షణాలుమారుతున్న ప్రపంచం, దారి తెలియని అడుగులువేల స్మృతుల వీడ్కోలు, రేపటికై ఆశగా చూస్తున్న కనులువెంట రానున్న ఒంటరితనం, మదిలో మెదిలిన మలుపులుచిన్నబోనున్న చిలిపితనం, ఆవిరైన మధురానుభూతులుమురిసిన మనసు కోలాహలం, అక్కున పరుచుకున్న చల్లని రాత్రులునీడలా తోడున్న నేస్తం,పంచుకున్న ఎన్నో పదనిసలుదూరమవుతున్న వర్తమానం, కడలి చెప్పిన వీడ్కోలు