మలేషియా దేశం కేవలం మలేయ్ జాతి మరియు స్థానిక తెగలే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన జాతులైన భారతీయులు మరియు చైనీయుల కలయిక. వారి పర్యాటకశాఖ నినాదం అయిన “సిసలైన ఆసియా” అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పడమర వైపున అండమాన్ సముద్రం/మలక్కా జలసంధి మరియు తూర్పు వైపున దక్షిణ చైనా సముద్రం కలిగి ఉన్న ద్వీపకల్పమైన మలేషియా (పడమర మలేషియా) నా తదుపరి గమ్యం. పోయిన వియత్నాం పర్యటనలో మలేషియా విమానాశ్రయం చూసే అవకాశం కలిగింది. ఇప్పుడు…
Category: Telugu Travel Blog
వియత్నాం (అనువాదం)
ఎన్నో ఏళ్ళ నుండి ప్రపంచ దేశాలన్నీ చుట్టేయాలని బలమైన కోరిక ఉండేది. కానీ ఇప్పటివరకు దేశం బయటికి అడుగు పెట్టలేదనే ఆవేదన, కల నిజమవ్వాలని నిరీక్షణ మనసును కలచివేస్తున్నాయ్. ఒక చిన్న దానితోనైనా మొదలు పెడదామని వెతుకుతుంటే దొరికింది ఈ వియత్నాం. భౌగోళిక భిన్నత్వం, గొప్ప చరిత్ర మరియు అపూర్వమైన సాంస్కృతిక వారసత్వం వియత్నాం సొంతం. పొడవైన సముద్ర తీరం, సొగసరి కాలువలు, అబ్బుర పరిచే గుహలు, చల్లటి పర్వత శ్రేణులు అన్నీ కలగలిసిన భూతల స్వర్గం. హనోయి…