చెదిరిన కలయే చెదగా మిగిలినా,నడవని కథయే నొప్పితో పగిలినా,వదిలిన దారియే వెదుకుతు తిరిగినా,కలిగిన బాధయే కారణం కోరినా ,తలచిన కార్యమే తరలి పోయినా,నలిగిన మదియే నరకం చూసినా,తడిసిన మనసే తపనతో కదిలినా,ఒరిగిన ధైర్యమే ఒడిసి పట్టినా,కరిగిన పదమే కాలం రచించినా,ఎరుగని ఫలితమే ఎదనే కోసినా,కదలని వైనమే కోరలు చాపినా,మరచిన బాధయే మరలా మెదలినా,కోరికని వదలక కసితో కదిలినా,మౌనం మిగిలెను మాటల బదులున,వ్యధతో నడిచెను,కడలి అంచునతనువే మిగిలెను,సాగర నడుమునమనసే కలిసెను ,గగనపు అంచున
నీ గమ్యం…
నీ గమ్యం ఇదేనా?నీ అడుగులు సరియేనా??నీ తడబడిన అడుగులలో మసకబారిన గమ్యమిదేనా??నలుగురితో నడక నీ గురికి చీలిక!కాసుల కోసం పరుగు ఇదేనా తిరకాసు?పగటి కలగా మిగిలే పనిలో సంతృప్తి పోయే!!అలసత్వం,చేతగానితనం ఇదేనా నీ సంకల్పం??నీ కోరికకు సర్దుబాటు ఎన్నటికి కాబోదు దిద్దుబాటు!!!ప్రగల్భాలు పలికిన మదికి ఆత్మవంచన సరియేనా???చాపకింద నీరు గాలి కోరి ఆవిరాయే !!!!గుండెకోత,మనోవేదన ఇదేనా కారణజన్మం????నీలకంటుడివి కావు సకలకళావల్లభుడసలే కావు!!!!! -ఆసక్తి లేని పని చేస్తున్న వారికి అంకితం
దిగులు పడకు….
దిగులు పడకు కలత చెందకు మిత్రమా!!ఓటమి నేర్పింది నీకు గెలుపు పాఠం వెక్కిరింత అయ్యింది నీకు ఊపిరి చేతగానితనం అయ్యింది నీ గమ్యానికి చేదోడు నైరాశ్యం నింపింది నీలో ఆత్మవిశ్వాసం అతివిశ్వాసం కానుంది నీకు ఆత్మవిశ్వాసం దిగులు పడకు కలత చెందకు మిత్రమా!! నమ్మకం నిలబెట్టింది నిన్ను గెలుపు గమ్యంలో మమకారం మిగిలింది నీ బాటలో బాటసారిగాకలత చెందక కసితో కాలుదువ్వు కాలంతో తిరిగిరాయి నీ రాతని నీ చేతలతో సాటిలేరు నీకెవ్వరు నీకు నువ్వే పోటీ భుజం తట్టి లేపు నీలోని నిన్ను నీ పతనమే నీ పరుగు పయనానికి…